30 తర్వాత వీటిని తినాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:00 AM
హార్మోన్లలో హెచ్చుతగ్గులు తలెత్తకుండా ఉండాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా, పేగుల ఆరోగ్యం భేషుగ్గా ఉండాలన్నా, శక్తి సన్నగిల్లకుండా ఉండాలన్నా 30 ఏళ్ల నుంచి కొన్ని ప్రత్యేకమైన పోషకాల మీద దృష్టి పెట్టాలి. అవేంటంటే...
హార్మోన్లలో హెచ్చుతగ్గులు తలెత్తకుండా ఉండాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా, పేగుల ఆరోగ్యం భేషుగ్గా ఉండాలన్నా, శక్తి సన్నగిల్లకుండా ఉండాలన్నా 30 ఏళ్ల నుంచి కొన్ని ప్రత్యేకమైన పోషకాల మీద దృష్టి పెట్టాలి. అవేంటంటే...
హార్మోన్లు: హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవకుండా ఉండడం కోసం, అవకాడొ, వాల్‌నట్స్, గుమ్మడి విత్తనాలు, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, బాదం, ఉసిరి తరచూ తింటూ ఉండాలి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఖనిజ లవణాలు శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని స్థిరంగా ఉంచడంతో పాటు హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవకుండా నివారిస్తాయి.
పేగులు: పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది, పేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉండడం కోసం, చిలకడదుంపలు, యాపిల్, సెనగలు, పెరుగు, కివి, ఓట్స్ తీసుకుంటూ ఉండాలి. వీటితో పీచు సమృద్ధిగా దొరుకుతుంది. పులిసిన పదార్థాలతో పేగుల్లోని మైక్రోబియం ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకలు: రాగి, పెరుగు, మెంతులు, ఆకుకూరలు, బ్రొకొలి, నువ్వులు, నారింజ తరచూ తింటూ ఉండాలి. వీటిలోని క్యాల్షియం, విటమిన్ కె, మెగ్నీషియంలు ఎముకలను బలపరుస్తాయి.
శక్తి: అరటిపండ్లు, పుచ్చ, స్ట్రాబెర్రీస్, పుట్టగొడుగులు, రాజ్మా, కొబ్బరినీళ్లలో పిండిపదార్థాలు, ఎలకొ్ట్రలైట్లు, ప్రొటీన్, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తి క్షీణించిపోకుండా రోజంతా నిలకడగా కొనసాగడానికి తోడ్పడతాయి.
ప్రొటీన్: గుడ్లు, పన్నీర్, పెరుగు, పప్పు, రాజ్మా, సెనగలు, చేపలు, చికెన్, టోఫుల్లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. కండరపుష్ఠికి, పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రొటీన్ అత్యవసరం. కాబట్టి ప్రతి భోజనంలో సరిపడా ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆత్మహత్యను ఆపొచ్చు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News