జ్వరాలకు జబర్దస్త్ వైద్యం
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:36 AM
ఆహారం, నీటి కాలుష్యం కారణంగా పలు రకాల జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయితే జ్వరాల లక్షణాలన్నీ ఒకేలా ఉన్నా, వ్యక్తిగత లక్షణాల ఆధారంగా, సమర్థమైన హోమియో మందులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
ఆహారం, నీటి కాలుష్యం కారణంగా పలు రకాల జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయితే జ్వరాల లక్షణాలన్నీ ఒకేలా ఉన్నా, వ్యక్తిగత లక్షణాల ఆధారంగా, సమర్థమైన హోమియో మందులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, ఆకలి తగ్గడం, చలి, ఒణుకు ప్రధాన ఫ్లూ లక్షణాలు. అయితే దోమల వల్ల మలేరియా, డెంగు, చికున్ గున్యా వేధిస్తాయి. నీరు, ఆహార కాలుష్యం వల్ల టైఫాయిడ్, కలరా ఇబ్బంది పెడతాయి. అలాగే వైర్‌సతో వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజాలో కూడా ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఇన్‌ఫ్లూయెంజా ఎ ప్రమాదకరమైన వైరస్. ఈ హెచ్1ఎన్1తో స్వైన్‌ఫ్లూ వేధిస్తుంది. కాబట్టి జ్వరం మూడు రోజులకు మించి కొనసాగినా, 103, 104 డిగ్రీలకు తగ్గకపోతున్నా, జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వేధిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో జ్వరంతో పాటు వాంతులు కూడా ఉంటాయి. కొందర్లో బలహీనత పెరిగిపోయి, స్హ్పహ కోల్పోతూ ఉంటారు. మూత్రంలో, చిగుళ్లలో రక్తం కనిపించినప్పుడు స్వైన్‌ఫ్లూగా అనుమానించి అత్యవసర చికిత్స కోసం వైద్యులను ఆశ్రయించాలి.
భిన్నమైన వ్యక్తిగత లక్షణాలు
శరీరంలో తలెత్తే మార్పులు, ప్రధాన లక్షణాల ఆధారంగా హోమియో చికిత్స కొనసాగుతుంది. అయితే కొందర్లో వ్యక్తిగత లక్షణాలు కనిపిస్తాయి. శరీర తత్వం, రోగనిరోధక వ్యవస్థలో వ్యత్యాసాల వల్ల వ్యక్తుల్లో జ్వరంతో పాటు విభిన్నమైన వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి. సాధారణ ఫ్లూ లక్షణాలకు తోడు కొందర్లో గొంతునొప్పి ఉంటుంది. కొందరికి వణుకు ఉంటుంది. కొందరికి నాలుక తెల్లగా ఉంటుంది. ఇంకొందరికి నాలుక మొత్తం తెల్లగా ఉండి, కొన ఎర్రగా ఉండొచ్చు. మరికొందరికి నాలుక మొత్తం ఎర్రగా కనిపిస్తుంది. కాబట్టి హోమియో వైద్యులు వ్యక్తిగత లక్షణాల ఆధారంగా చికిత్సను ఎంచుకుంటూ ఉంటారు.
సమర్థమైన ఔషధాలతో...
ఆర్సెనిక్ ఆల్బమ్, జెల్సీమియం, ఇన్‌ఫ్లూయెంజా వైర్‌సతో తయారైన ఇన్‌ఫ్లూయెంజినం, వైరల్ ఫీవర్ కోసం ప్రత్యేకించి ఆసిలోకాక్సినం, అనార్‌బార్బేరి మందులు సమర్థమైన ఫలితాన్ని కనబరుస్తాయి. ఆసిలోకాక్సినం, జెల్సీమియం, ఇన్‌ఫ్లూయెంజనం అనే మందులను లక్షణాలు లేకపోయినప్పటికీ, నివారణ చికిత్సలో భాగంగా ముందస్తు జాగ్రత్త కోసం వాడుకోవచ్చు. ఒకవేళ జ్వరం మొదలైతే సాధారణ ఫ్లూ మందులతో పాటు, వ్యక్తిగత లక్షణాల ఆధారంగా అదనపు మందులను ఎంచుకోవలసి వస్తుంది. కొందరికి జ్వరం కనిపించకపోయినా, నీరసం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారికి యాంటీ వైరల్ మందులతో ఫలితం కనిపిస్తుంది. కొందర్లో మిశ్రమ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ మందులను రోజులో మూడు పూటలూ మార్చి మార్చి వాడుకోవలసి ఉంటుంది.
అత్యవసర మందులున్నాయి
జ్వరాన్ని వెనువెంటనే తగ్గించే అత్యవసర మందులు హోమియోపతిలో కూడా ఉన్నాయి. ప్రతి పావు గంటకూ తీసుకునే బెల్లబోనా మందుతో జ్వరం గంటలో తగ్గిపోవడం మొదలుపెడుతుంది. అలాగే పైరోజీనియం, బాప్టీషియా, ఫెర్రంఫాస్ మందులన్నీ అత్యవసర చికిత్సలో వాడుకోవచ్చు.
డాక్టర్ గన్నం రాజు దుర్గాప్రసాద్ రావు,
హోమియోపతి వైద్యులు,
నిత్య హోమియోపతి,
కుత్బిగూడ, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పౌడర్‌తో గంటలో శుభ్రమైన నీరు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News