Share News

‘స్కిన్‌ సైక్లింగ్‌’ ట్రెండ్‌!

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:55 AM

అందం, చర్మ సౌందర్యం అనగానే పాతకాలపు శనగపిండి, పసుపు పూతలు లేదా మార్కెట్లో దొరికే ఏవేవో ఫేస్‌ క్రీమ్‌లు రాసేయడం ఇప్పుడు పాత పద్ధతి. నేటి తరం మహిళలు సైంటిఫిక్‌ స్కిన్‌ కేర్‌ విధానాలకు పెద్దపీట వేస్తున్నారు.

‘స్కిన్‌ సైక్లింగ్‌’ ట్రెండ్‌!
skin care

స్కిన్‌ కేర్‌

అందం, చర్మ సౌందర్యం అనగానే పాతకాలపు శనగపిండి, పసుపు పూతలు లేదా మార్కెట్లో దొరికే ఏవేవో ఫేస్‌ క్రీమ్‌లు రాసేయడం ఇప్పుడు పాత పద్ధతి. నేటి తరం మహిళలు సైంటిఫిక్‌ స్కిన్‌ కేర్‌ విధానాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగమే ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్న ‘స్కిన్‌ సైక్లింగ్‌’ పద్ధతి. మనం రోజూ వాడే కెమికల్‌ ఉత్పత్తులను చర్మం తట్టుకోలేక ఎర్రగా మారడం, అలర్జీలు రావడం లేదా చర్మ పొర దెబ్బతినడం వంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా చర్మానికి తగినంత విశ్రాంతినిస్తూనే కాంతివంతంగా మార్చే 4 రోజుల రాత్రి వేళ రొటీనే ఈ స్కిన్‌ సైక్లింగ్‌!

మొదటి రాత్రి: ఫేస్‌ వాష్‌ చేసిన తర్వాత చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి ఏహెచ్‌ఏ లేదా బీహెచ్‌ఏ ఆధారిత ఎక్స్‌ఫోలియేటర్‌ను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి కాంతివంతంగా చేస్తుంది.

రెండో రాత్రి: చర్మంపై ముడతలు తగ్గడానికి, పింపుల్‌ మచ్చలు మాయమవడానికి ‘రెటినాల్‌’ క్రీమ్‌ వాడాలి. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

మూడు, నాలుగో రాత్రి: ఈ రెండు రోజులు చర్మానికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చే సమయం. ఎలాంటి కెమికల్స్‌ లేదా యాసిడ్స్‌ వాడకుండా కేవలం మాయిశ్చరైజర్‌, సెరామైడ్స్‌ లేదా హైఅలురోనిక్‌ యాసిడ్‌ మాత్రమే రాయాలి. ఇది చర్మ సహజ రక్షణ పొరను బలపరుస్తుంది.


సన్‌స్ర్కీన్‌ లేయర్‌: రాత్రి వేళల్లో రెటినాల్‌ లేదా ఎక్స్‌ఫోలియేటర్లు వాడినప్పుడు మరుసటి రోజు చర్మం ఎండకు త్వరగా కందిపోతుంది. అందుకే పగటిపూట ప్రతిరోజు నిద్రలేవగానే తప్పనిసరిగా ‘ఎస్‌పీఎఫ్‌ 50’ ఉన్న బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ సన్‌స్ర్కీన్‌ రాసుకోవడం ఈ సైకిల్‌లో అతి ముఖ్యమైన నియమం.

హైడ్రేషన్‌ బూస్ట్‌: కెమికల్స్‌ డోస్‌ ఎక్కువ కాకుండా ఉండేందుకు క్రీములు రాసేటప్పుడు నేరుగా ముఖంపై రుద్దకుండా, రెండు అరచేతులతో క్రీమ్‌ను తీసుకుని ముఖంపై మెల్లగా ఒత్తుకోవడం వల్ల ప్రొడక్ట్‌ చర్మం లోపలి పొరల్లోకి త్వరగా ఇంకుతుంది.

ఇవి కూడా చదవండి

పిల్లల ప్రేమే నడిపిస్తోంది

పారదర్శకతకు ఈ-కేవైసీ..

Updated Date - Aug 24 , 2026 | 01:55 AM