Share News

సీత క్యారెక్టర్‌ను అలా చిత్రీకరిస్తారా? ముఖేష్ కన్నా అసంతృప్తి

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:32 PM

ఇటీవలే విడుదలైన రామాయణ్ సినిమాలోని సీత క్యారెక్టర్‌పై ప్రముఖ భారతీయ నటుడు ముఖేష్ కన్నా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక అభిరుచులకు తగ్గట్లు ఆ పాత్రను చిత్రీకరించారని, అలా చేయరాదని తన వ్లోగ్‌లో ఆయన పేర్కొన్నారు.

సీత క్యారెక్టర్‌ను అలా చిత్రీకరిస్తారా? ముఖేష్ కన్నా అసంతృప్తి

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే విడుదలైన రామాయణ్ సినిమాలోని సీత క్యారెక్టర్‌పై ప్రముఖ భారతీయ నటుడు ముఖేష్ కన్నా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక అభిరుచులకు తగ్గట్లు ఆ పాత్రను చిత్రీకరించారని, అలా చేయరాదని తన వ్లోగ్‌లో ఆయన పేర్కొన్నారు. తాను ఇంకా ఆ సినిమా చూడలేదని, పలు రివ్యూలు, సోషల్ మీడియాలో చర్చల కారణంగా తనకు ఆ విషయం తెలిసిందన్నారు. కొత్తగా వచ్చిన రామాయణ్ మూవీలో దయ్యాలపై సీత.. ఝాన్సీ రాణిలా పోరాడుతున్నట్లు చూపారని, ఆమెను ఒక ఫైటర్‌గా చిత్రీకరించినట్లు ఒకరు పోస్టు చేశారని చెప్పారు.


‘ఆ వ్యక్తి చెప్పిన విషయంపై నేను చెక్ చేశాను. నిజంగా ఆ సినిమాలో దయ్యాలపై సీత పోరాడుతున్నట్లు చూపారు. వాస్తవానికి వాల్మీకీ రామాయణంలో ఇలా లేదు. నేను చదివిన గ్రంథాల నుంచి, అలాగే నాకు తెలిసినంతవరకు సీత ఎప్పుడూ పోరాడలేదు. మర్యాద పురుషోత్తముడు రాముడి భార్య ఆమె. భర్తపై అసమాన భక్తి, అంకిభాతం ఉన్న మహిళ ఆమె. 14 ఏళ్లపాటు భర్తతో పాటు వనవాసం చేశారు. రాజభోగాలు, సుఖాలు వదులుకుని ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అడుగుజాడల్లోనే నడిచారు. అలాంటి అద్భుతమైన సీత క్యారెక్టర్‌ను మార్చారు. ఆమె నిజంగా ఫైటర్ అయుంటే, రావణాసురుడు తనను ఎత్తుకుపోతున్నపుడు కూడా అతనితో పోరాడి ఉండవచ్చు కదా? అంత సులభంగా ఆమెను రావణుడు ఎలా కిడ్నాప్ చేయగలడు?’ అని ముఖేష్ వ్యాఖ్యానించారు.


ఇటీవలే తాను రామ్ లీలా కార్యక్రమానికి హాజరయ్యానని ముఖేష్ తెలిపారు. అందులో సీత మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్లు, కత్తి తిప్పుతున్న సీన్లు రావడం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇలా చేస్తున్నందుకు వారంతా సిగ్గుపడాలని ఆయన మండిపడ్డారు. ‘సీతను ఒక ఫైటర్‌గా చూపడం ద్వారా ఆధునిక మహిళలు ఇలా ఉంటారని మీరు చెబుతున్నారు. కొంతమంది దానిని ఫెమినిజం అంటారు. నాకు దాని గురించి పెద్దగా తెలియదు. ఆధునిక మహిళలు బలంగానే ఉండవచ్చు. ఆ విషయాన్ని నేను వివాదం చేయదలచుకోవడం లేదు. కానీ, రామాయణంలో సీత క్యారెక్టర్ మార్చడం కరెక్టు కాదు’ అని ముఖేష్ వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

మోదీతో మాటలుండవు.. నమస్కారాలకే పరిమితం: సోనియా గాంధీ

ఎన్విడియా అధినేతకు బిగ్ షాక్.. ఒక్కరోజే 7.4 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి.!

Updated Date - Nov 10 , 2026 | 04:41 PM