Share News

ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:22 PM

కళ్లకురుచి జిల్లా కలెక్టర్‌ జేఈ పద్మజకు టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విగ్నేశ్ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. అంతేకాకుండా తాగిన మైకంలో ఆ కలెక్టర్ ఇంటికి వెళ్లి ఆమెను ఎమ్మెల్యే వేధించారని కనిమొళి తన ఎక్స్‌లో అకౌంట్‌లో అన్నారు.

ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ

ఇంటర్నెట్ డెస్క్: కళ్లకురుచి జిల్లా కలెక్టర్‌ జేఈ పద్మజకు టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విగ్నేశ్ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. అంతేకాకుండా తాగిన మైకంలో ఆ కలెక్టర్ ఇంటికి వెళ్లి ఆమెను ఎమ్మెల్యే వేధించారని కనిమొళి తన ఎక్స్‌లో అకౌంట్‌లో అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పారు. ఆ ఘటన తర్వాత కలెక్టర్ పద్మజకు ఒక భద్రతా అధికారిని కేటాయించారని తెలిపారు.


ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే

తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే విగ్నేశ్ ఖండించారు. అవన్నీ వదందులు మాత్రమే మీడియాతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. ‘కలెక్టర్ నివాసంలో సీసీటీవీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. అంతేకాకుండా ఆ నివాసంలో పటిష్ట భద్రత ఉంటుంది. అలాంటి చోట నేను వెళ్లి కలెక్టర్‌ను ఎలా వేధించగలను? నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేస్తున్నా. ఇందు కోసం నేను ఏ పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నాను. వదంతులు వదంతులే. అవి నిజం కావు’ అని విగ్నేశ్ అన్నారు. అదంతా డీఎంకే ఐటీ విభాగం చేస్తున్న దుష్ప్రచారం అని ఆయన పేర్కొన్నారు.


కాగా.. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తామని విద్యా శాఖ మంత్రి రాజ్ మోహన్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. విజయ్ ప్రభుత్వంలో వేధింపులకు తావు లేదన్నారు. నిందితుడిగా ఎవరు ఉన్నా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఇవీ చదవండి:

మోదీతో మాటలుండవు.. నమస్కారాలకే పరిమితం: సోనియా గాంధీ

ఎన్విడియా అధినేతకు బిగ్ షాక్.. ఒక్కరోజే 7.4 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి.!

Updated Date - Nov 10 , 2026 | 03:25 PM