Share News

ఓటర్ల జాబితాలో పేరులేని వారు ఫాం 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు: ఈసీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:17 AM

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత పబ్లిష్ అయిన ఓటరు జాబితాలో పేరు కోల్పోయిన వారు ఫాం 6 ద్వారా కొత్తగా అప్లై చేసుకోవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ)తెలిపింది. అలాంటి వారు అంతకుముందు ఓటర్లుగా నమోదై ఉన్నా కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

ఓటర్ల జాబితాలో పేరులేని వారు ఫాం 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు: ఈసీ

ఇంటర్నెట్ డెస్క్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత పబ్లిష్ అయిన ఓటరు జాబితాలో పేరు కోల్పోయిన వారు ఫాం 6 ద్వారా కొత్తగా అప్లై చేసుకోవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ)తెలిపింది. అలాంటి వారు అంతకుముందు ఓటర్లుగా నమోదై ఉన్నా కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈనెల 3న లేఖ రాసింది. ఫాం 6 ద్వారా కొత్తగా అప్లై చేసినా.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని, అలా దరఖాస్తు చేసినంతమాత్రాన తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు కాదని ఈసీ వివరించింది. కాగా.. కొత్తగా విడుదల చేసిన ఓటరు జాబితాలో పలువురు ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో అలాంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి సందేహిస్తున్నారు. ఫాం 6 ద్వారా అప్లై చేస్తే తమను ఓటరు జాబితాలో మొదటిసారిగా చేరుస్తారన్న సందేహం వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసీ క్లారిటీ ఇచ్చింది.


ఓటరు జాబితాలో పేరులేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని, ఇలా చేయడం వల్ల ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, వారు పాత ఓటర్లు అయి ఉన్నా కూడా ఇబ్బందులు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. సెక్షన్ 31 కింద ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, దరఖాస్తుదారులు మరో పార్లమెంటరీ నియోజకవర్గంలోగానీ, అసెంబ్లీ నియోజకవర్గంలో గానీ ఓటరుగా నమోదై ఉండకూడదని ఈసీ తెలిపింది. కాగా.. సర్ ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఈ మేరకు ఒక క్లారిటీ ఇచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 11:25 AM