Share News

విజయ్‌కి నటితో వివాహేతర సంబంధం ఉంది.. భార్య తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 05:46 PM

విజయ్‌కి ఓ సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆయన భార్య సంగీత ఆరోపించారు. ఆ నటితో విదేశాలు, పార్టీలకు విజయ్‌ వెళ్తారని చెప్పుకొచ్చారు.

విజయ్‌కి నటితో వివాహేతర సంబంధం ఉంది.. భార్య తీవ్ర ఆరోపణలు
Vijay Divorce Case

ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (TVK Chief Vijay) వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల కిందటే తాము మానసికంగా విడిపోయామని విజయ్‌ భార్య సంగీత అన్నారు. విజయ్‌కి ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఆ నటితో విదేశాలకు, పార్టీలకు విజయ్‌ వెళ్తారని చెప్పుకొచ్చారు. విజయ్‌ తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే ఆ నటి పేరు బయటపెడతానంటూ సంగీత హెచ్చరించారు.


వివాహేతర సంబంధం ఓ ద్రోహం..

వివాహేతర సంబంధం ఓ ద్రోహమని సంగీత ఫైర్ అయ్యారు. విజయ్‌ వివాహేతర సంబంధం గురించి 2021లో తెలిసిందని అన్నారు. ఆ నటితో సంబంధం తెంచుకుంటానని విజయ్‌ తనతో చెప్పారని ప్రస్తావించారు. మాట తప్పి ఆ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పదేపదే తమ మధ్య విభేదాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆ నటికి మద్దతుగా విజయ్‌ మాట్లాడుతూ వచ్చారని.. ఆయన నిర్లక్ష్యం కారణంగా తాను ఒంటరినయ్యానని సంగీత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ విద్యా రంగంలో సంస్కరణలు.. కీలక సిఫార్సులు చేసిన కమిషన్

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 06:11 PM