సరదా కోసం వందే భారత్ రైలుపై రాళ్లు విసిరారు.. చివరకు
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:01 PM
సరదా కోసం కొందరు చేయకూడని పనులు చేసి అడ్డంగా బుక్ అవుతుంటారు. అలాగే గుజరాత్‌లో ముగ్గురు వ్యక్తులు ఓ తప్పు చేసి అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సరదా కోసం కొందరు చేయకూడని పనులు చేసి అడ్డంగా బుక్ అవుతుంటారు. అలాగే గుజరాత్‌లో ముగ్గురు వ్యక్తులు ఓ తప్పు చేసి అరెస్ట్ అయ్యారు. సూరత్ నుంచి ఉత్రాన్‌కు వెళ్తున్న వందే భారత్ రైలుపై వీరు రాళ్లు విసిరారు. దీంతో రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. రైల్వే ఆస్తిని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 23న ముగ్గురు వ్యక్తులు వందే భారత్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికులకు, రైలు సిబ్బందికి ఎలాంటి గాయాలు కానప్పటికీ రైల్వే ఆస్తికి నష్టం వాటిల్లింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ట్రాక్‌ల వద్ద నిందితుల కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తామే ఈ పనికి పాల్పడ్డామని నిందితులు అంగీకరించారు. అయితే సరదా కోసం ఇదంతా చేశామని వారు చెప్పడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
నోయిడాలో అగ్నిప్రమాదం.. ఐదు దుకాణాల్లో చెలరేగిన మంటలు, ఒకరి మృతి
పీస్ బాండ్‌పై సంతకం చేయను: ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా