పీస్ బాండ్‌పై సంతకం చేయను: ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:51 PM
స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు శాంతియుతంగా వ్యవహరిస్తానని హామీ ఇస్తూ సమర్పించాల్సిన పీస్ బాండ్పైన తాను సంతకం చేయనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఈరోజు (శనివారం) తేల్చిచెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు శాంతియుతంగా వ్యవహరిస్తానని హామీ ఇస్తూ సమర్పించాల్సిన పీస్ బాండ్పైన తాను సంతకం చేయనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఈరోజు (శనివారం) తేల్చిచెప్పారు. భారత ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నందుకు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నేహను విడుదల చేస్తూ.. శాంతిభద్రతలు కాపాడతాననే పూచీకత్తుతో రూ. 10 వేల వ్యక్తిగత బాండ్‌పై సంతకం చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే కోర్టు నేహ పిటిషన్‌ను కొట్టిపడేసింది. ఈ నేపథ్యంలో తాను పీస్ బాండ్‌పై సంతకం చేయదలచుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ‘ఎవరి శాంతిని నేను కాపాడాలి?’ అంటూ ప్రశ్నించారు. ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రజాస్వామిక హక్కని చెప్పారు. ప్రశ్నిస్తే చాలు.. శాంతికి భంగం కలిగించినట్టు ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. కాగా ‘సర్’ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిర్వహించిన నిరసనల్లో నేహా బోరా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
నిరసనలను వాయిదా వేయండి.. రాహుల్ గాంధీకి ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.