డిజిటల్ చెల్లింపులపై MDR ఛార్జీలు.. సుప్రీంకోర్టులో విచారణ
ABN , Publish Date - Sep 28 , 2026 | 10:40 AM
సుప్రీంకోర్టులో యూపీఐ ఎండీఆర్ ఛార్జీల విధానంపై సోమవారం విచారణ జరగనుంది. రూ. 2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించనుంది.
ఢిల్లీ, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో (Supreme Court) యూపీఐ ఎండీఆర్ ఛార్జీల విధానంపై ఈరోజు (సోమవారం) విచారణ జరగనుంది. రూ. 2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించనుంది. ఎండీఆర్ చట్టబద్ధత, వ్యాపారులు, డిజిటల్ వినియోగదారులపై దాని ప్రభావం గురించి ప్రశ్నిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయవాది అంజన్ దత్తా దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌ను,సెప్టెంబర్ 15వ తేదీన ప్రకటించిన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను రద్దు చేయాలని న్యాయవాది అంజన్ దత్తా కోరారు.
రూ. 2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించే ఫ్రేమ్‌వర్క్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. ప్రత్యామ్నాయంగా, పారదర్శక సంప్రదింపులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రక్షణ చర్యలతో ఫ్రేమ్‌వర్క్‌ను పున:పరిశీలించాలని పిటిషనర్ కోరారు. భవిష్యత్తులో చేసే ఏ ఎండీఆర్ వర్గీకరణ అయినా వ్యాపారి టర్నోవర్, చట్టబద్ధమైన ఎంఎస్ఎంఈ హోదా, వాస్తవ మార్జిన్‌లు, భౌగోళిక ప్రాంతం ఖర్చును భరించే సామర్థ్యం వంటి సంబంధిత అంశాల ఆధారంగా ఉండేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్
రేవంత్.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News And AP News And National News
And Telugu News