కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గుర్తింపు..
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:38 PM
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో పవర్‌ఫుల్ ఇండియన్స్ (శక్తిమంతమైన భారతీయులు) జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన వంద మంది శక్తిమంతమైన భారతీయుల జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానాన్ని పొందారు.
న్యూఢిల్లీ, మార్చి 29: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో పవర్‌ఫుల్ ఇండియన్స్ (శక్తిమంతమైన భారతీయులు) జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన వంద మంది శక్తివంతమైన భారతీయుల జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానాన్ని పొందారు. మోదీ ప్రస్తుత కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు అయిన కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గుర్తింపు పొందారు. గతేడాది 2025 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా (AI 171) విమాన ప్రమాదం.. అలాగే ఇండిగో విమానయాన సంక్షోభాలను పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
అదే విధంగా దేశీయ ఏరోస్పేస్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు. లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా కేంద్ర మంత్రిగా పార్లమెంటులో బలమైన ప్రాంతీయ గళాన్ని ఆయన తనదైన శైలిలో వినిపిస్తున్నారు. అలాగే పలు సామాజిక అంశాలపై నిరంతరంగా ఆయన పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు రామ్మోహన్ నాయుడు మంచి ఫొటోగ్రాఫర్ కూడా. నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో 38 ఏళ్ల అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రుల్లో ఒకరిగా రామ్మోహన్ నాయుడు గుర్తింపు పొందారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి..
హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా: బండి సంజయ్
For More National News And Telugu News