తృణమూల్‌లో ఇకపై రెండు వర్గాలు.. మమత పార్టీకి ఏ గుర్తంటే?
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:39 PM
పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంసీలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ ఆ పార్టీని రెండు వర్గాలుగా విభిజించి.. విడిగా పేర్లు, గుర్తులను కేటాయించింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నకలు సమీపిస్తున్న వేళ.. తృణమూల్ కాంగ్రెస్(TMC)లో నెలకొన్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెరదించింది. టీఎంసీకి చెందిన రెండు వర్గాలకు కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులను కేటాయించింది ఈసీ. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(MAITMC)’ పేరును కేటాయిస్తూ.. ‘ఫుట్‌బాల్ ప్లేయర్(Foot ball player)’ గుర్తును ఇచ్చింది. ఇక రెబల్స్ గ్రూపైన రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఇంకో వర్గానికి ‘డెమొక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్(DTMC)’ పేరును ఖరారు చేస్తూ, ‘ఎన్వలప్ కవర్(Envelop Cover)’ గుర్తును కేటాయించింది.
కాగా.. ఇటీవల టీఎంసీ పేరు, ఆ పార్టీకి కేటాయించిన ‘ఫ్లవర్(పూలు)-గ్రాస్(గడ్డి)’ ఎన్నికల గుర్తును ఇరు వర్గాలు వినియోగించకుండా ఈసీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 6న జరిగే(నందిగ్రామ్, రేజీనగర్) ఉపఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా రెండు వర్గాలకు తాత్కాలికంగా ఇలా కొత్త పేర్లు, గుర్తులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. ఈ వివాదంపై తుది నిర్ణయం వెలువడే వరకు ఇరువర్గాలు అసలు పార్టీ పేరు, రిజర్వ్‌డ్ గుర్తును ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. దానికి బదులుగా ఉపఎన్నికల కోసం కేటాయించిన కొత్త పేర్లు, గుర్తులతోనే పోటీ చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
పైథాన్‌ను ఇట్టే పట్టేసి.. చేతికి చుట్టేసిన ఐటీ ఉద్యోగి.!
గ్రిల్‌లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్