Share News

Excise Department Officers Arrested: రూ.25 లక్షలు లంచం.. పట్టుబడిన ఎక్సైజ్ శాఖ అధికారులు

ABN , Publish Date - Jan 17 , 2026 | 09:29 PM

లోకాయుక్త భారీ ఆపరేషన్ చేపట్టి.. ముగ్గురు అవినీతి అధికారులను పట్టుకుంది. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులను లోకాయుక్త పట్టుకుంది.

Excise Department Officers Arrested: రూ.25 లక్షలు లంచం.. పట్టుబడిన ఎక్సైజ్ శాఖ అధికారులు
Karnataka Lokayukta

బెంగళూరు, జనవరి18: చాలా మంది ప్రభుత్వ అధికారులు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కోసం కృషి చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం అవినీతి సముద్రంలో మునిగి తేలుతుంటారు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఫలానా ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా కర్నాటక రాష్ట్రంలో రూ.25 లక్షలు తీసుకుంటూ మూడు అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులను లోకాయుక్త పట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


బెంగళూరులో నివాసం ఉండే సి. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సీఎల్-7 (హోటల్/ క్లబ్) లైన్స్, మైక్రో బ్రూవరీ (బీరు తయారీ ప్లాంట్స్) లైసెన్స్ కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. వీటి జారీకి సంబంధించిన పత్రాలను క్లియర్ చేయడానికి ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులు రూ.80 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తొలుత రూ. 25 లక్షల ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో లోకాయుక్తను ఆశ్రయించిన లక్ష్మీనారాయణ అసలు విషయం చెప్పాడు. పక్కా ప్లాన్ ప్రకారం రూ.25 లక్షలు తీసుకుంటుండగా ఆ ముగ్గురిని లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు.


అరెస్టైన ముగ్గురు అధికారులను వివరాలను లోకాయుక్త వెల్లడించింది. జగదీష్ నాయక్ (57) ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, తమ్మన్న కె.ఎం. (41) ఎక్సైజ్ సూపరింటెండెంట్, లక్కప్ప(31), ఎక్సైజ్ కానిస్టేబుల్ గా అధికారులు గుర్తించారు. ఈ అవినీతి అధికారులను పట్టుకునే ఆపరేషన్ ను లోకాయుక్త ఎస్పీ శివ ప్రకాష్ దేవరాజు పర్యవేక్షించారు. ముగ్గురినీ సంఘటనా స్థలంలోనే అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ లంచం డిమాండ్ ప్రయత్నంలో ఇతర అధికారుల ప్రమేయం ఉందా లేదా అని నిర్ధారించడానికి లోకాయుక్త దర్యాప్తు చేస్తుంది.


ఇవీ చదవండి

కర్ణాటకలో బాలుడికి భారీగా బంగారు నాణేలు లభ్యం.. రంగంలోకి ప్రభుత్వం

గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు

Updated Date - Jan 17 , 2026 | 09:56 PM