తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:16 AM
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్‌లో భోజనం చేసిన అనంతరం 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్,, జూన్4 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్‌లో భోజనం చేసిన అనంతరం 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో పలువురికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
కంపెనీ క్యాంటీన్‌లో అందించిన ఆహారం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా బిర్యానీ తిన్న తర్వాత ఉద్యోగులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో అధికారులు బిర్యానీ నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఆహార నమూనాల పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజన్‌కు అసలు కారణం ఏమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆహార తయారీ, నిల్వ విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్థానిక ఆరోగ్య శాఖ, ఆహార భద్రతా విభాగం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News