Share News

దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 12 , 2026 | 09:37 AM

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అన్నూర్‌లో విషాదం చోటు చేసుకుంది. దోమల నివారణకు పురుగుమందు పిచికారీ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి
Tamil Nadu news

తమిళనాడు, ఆగస్టు 12: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అన్నూర్‌లో విషాదం చోటు చేసుకుంది. దోమల నివారణకు పురుగుమందు పిచికారీ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. అన్నూర్‌ టౌన్ పంచాయతీ పరిధిలో డెంగ్యూ జ్వరంతో అనేక మంది బాధపడుతున్నారు. ఈ క్రమంలో డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించేందుకు ఇళ్లలో దోమల నివారణ కోసం పురుగుమందు చల్లాలని అధికారులు నిర్ణయించారు. ఆ వెంటనే అన్నూర్‌‌లోని ప్రతీ ఇంటి వద్ద పురుగుమందును పిచికారీ చేశారు.


అయితే పురుగుమందు పిచికారీ చేసిన కొద్దిసేపటికే వరుసగా ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పురుగుమందు పిచికారీ చేసిన తర్వాతే ఇద్దరు మృతిచెందడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఆ ఇద్దరి మృతికి పురుగుమందే కారణమా లేక.. మరేదైనా కారణమా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి...

6 లేన్లు సరిపోతాయా?

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

Read Latest National News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 09:47 AM