ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ABN , Publish Date - Aug 12 , 2026 | 09:11 AM
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఏలూరు, ఆగస్టు12: జిల్లాలో జంగారెడ్డిగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి దారితీసిన కారణాలు, ఆగి ఉన్న లారీ వద్ద భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
వైసీపీ పట్ల భవిష్యత్‌లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న
ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్