ఆ గ్రామంలో వినూత్న ఆచారం.. దెెయ్యం బొమ్మతో..
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:20 PM
వర్షం కురవాలని కోరుతూ దెయ్యం బొమ్మకు గ్రామస్తులు అంతిమయాత్ర నిర్వహించి వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
‘దెయ్యం’ బొమ్మకు అంతిమసంస్కారం
చెన్నై: వర్షం కురవాలని కోరుతూ దెయ్యం బొమ్మకు గ్రామస్తులు అంతిమయాత్ర నిర్వహించి వినూత్న కార్యక్రమం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లా అనైమలై, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృతి. ఆలియారు డ్యాం నుంచి విడుదల చేసే నీరు, బావులు, వర్షాధార నీటి ఆధారంగా ఆ ప్రాంత వాసులు వ్యవసాయం చేపడుతుంటారు. ఈ క్రమంలో, ప్రస్తుతం వర్షం లేక బావులు, చెరువులు ఎండిపోయి తాగునీటికి కూడా ప్రమాదం ఏర్పడింది.
ఈ క్రమంలో, వర్షం కురిసి వ్యవసాయం సాగాలని కోరుతూ మంజనాయకనూరు గ్రామస్తులు వినూత్న వేడుకలు నిర్వహించారు. దెయ్యం ఆకారంలో బొమ్మను తయారుచేసి మృతిచెందినట్లు పడుకోబెట్టారు. బొమ్మ చుట్టూ తిరుగుతూ మహిళలు రోధించారు. అనంతరం అంతిమయాత్రగా గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఖననం చేశారు. ఇలాంటి వేడుకల ద్వారా వర్షం కురుస్తుందని పూర్వీకులు చెబుతుంటారని, ఆ ప్రకారం, తాము కూడా వేడుకలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురి మృతి
మహారాష్ట్రలో విషాదం.. ఈతకు వెళ్లి 8 మంది మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News