Share News

మహారాష్ట్రలో విషాదం.. ఈతకు వెళ్లి 8 మంది మృతి

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:35 PM

ఈత సరదా 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. సముద్రంలో సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులు ఒక్కసారిగా అలలకు కొట్టుకుపోయారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

మహారాష్ట్రలో విషాదం.. ఈతకు వెళ్లి 8 మంది మృతి

ఇంటర్‌నెట్ డెస్క్: ఈత సరదా 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. సముద్రంలో సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులు ఒక్కసారిగా అలలకు కొట్టుకుపోయారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పుణెలోని అళందిలో ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన 11, 12వ తరగతి విద్యా్ర్థులు.. రాయ్‌గఢ్ జిల్లాలోని దిఘీ సాగరిలో దివేగర్ బీచ్‌కు వెళ్లారు. మొత్తం 48 మంది వచ్చారు. వారిలో 25 మంది బాలురు, 17 మంది బాలికలు, ఆరుగురు టీచర్లు ఉన్నారు.


విద్యార్థుల్లో కొంతమంది బీచ్‌లో దిగి ఈత కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన అలలు.. 8 మంది విద్యార్థులను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. దీంతో భయపడిపోయిన వారి స్నేహితులు బిగ్గరగా కేకలు వేశారు. తమ స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోతుండగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వారిని కాపాడాలని బిగ్గరగా అరిచారు.


రంగంలోకి రెస్క్యూ టీం

విద్యార్థుల కేకలు విని టూరిస్టులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. వాటర్ స్పోర్ట్స్‌కు చెందిన బహు సాలుంకె, ఆయన బృందం వెంటనే రంగంలోకి దిగారు. కొట్టుకుపోయిన విద్యార్థుల కోసం వారు తీవ్రంగా గాలించారు. అయినా కూడా విద్యార్థుల జాడ తెలియరాలేదు. అలాగే పోలీసులు కూడా బీచ్‌కు చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత విద్యార్థుల మృతదేహాలను కనుగొన్నారు. ఆ మృతదేహాలను సముద్రం నుంచి రికవరీ చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను బోర్లి పంచతన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కళ్ల ముందే స్నేహితులు చనిపోవడంతో విద్యార్థులు తీవ్రంగా విలపించారు. విహారయాత్ర విషాదంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2026 | 12:49 PM