Share News

బాలయోగికి స్పీకర్‌ ఓంబిర్లా నివాళులు

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:23 AM

లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగిజయంతి సందర్భంగా ఆయనకు సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా పుష్పాంజలి ఘటించారు.

బాలయోగికి స్పీకర్‌ ఓంబిర్లా నివాళులు

న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగిజయంతి సందర్భంగా ఆయనకు సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా పుష్పాంజలి ఘటించారు. బాలయోగి చిత్రపటానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌, పార్లమెంట్‌ సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు గురువారం నివాళులు అర్పించారు. లోక్‌సభసెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి.మోదీ కూడా బాలయోగికి సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్లో నివాళులు అర్పించారు. కాగా.. బాలయోగి పన్నెండో లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. ఆయనను పదమూడో లోక్‌సభకు కూడా స్పీకర్‌గా ఎన్నుకున్నారు. బాలయోగి చిత్రపటాన్ని హిమ్‌ చటర్జీ రూపొందించగా 2014 ఫిబ్రవరి 10న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 06:23 AM