Share News

రైతు రుణాల మాఫీ... విజయ్ మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - May 25 , 2026 | 07:46 PM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు సోమవారంనాడు ప్రకటించారు.

రైతు రుణాల మాఫీ... విజయ్ మరో కీలక నిర్ణయం
Tamil Nadu CM Vijay

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు సోమవారంనాడు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ ప్రకారం రూ.50,000 వరరూ పంట రుణాలు తీసుకున్న సన్నకారు రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేస్తారు. రూ.50 వేలకు పైబడి తీసుకున్న రుణాలకు 50 శాతం మాఫీని ప్రకటించారు.


ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమీపంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే తాజా రుణమాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో 14.22 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ఖజానాపై రూ.2,044 కోట్ల భారం పడుతుందని విజయ్ తెలిపారు.


మేకేదాటు ప్రాజెక్టుపై సమీక్ష

కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదిత మేకేదాటు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ఏవిధంగా స్పందించాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి విజయ్ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. కర్ణాటక ప్రతిపాదనను తమిళనాడు వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రాలకు రావాల్సిన జలాలపై ప్రభావం పడుతుందని, రైతులకు నష్టం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వ వాదనగా ఉంది. కర్ణాటకలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల భూమిపూజ జరగడం, ఈ వివాదంపై లీగల్ స్టాటస్‌ను విజయ్ సమావేశంలో అధికారులు సమీక్షించారు. కోర్టు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుని సమగ్ర సంప్రదింపుల అనంతరం తీసుకోవాల్సిన లీగల్ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రి ఎన్.ఆనంద్, ఆధవ్ ఆర్జున, ఆర్.నిర్మల్‌కుమార్, అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆస్తులపై నోటీసు..అభిషేక్ బెనర్జీ నివాసానికి భారీగా పోలీసులు

ఏఐఏడీఎంకేలో ముదురుతున్న తిరుగుబాటు.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

Updated Date - May 25 , 2026 | 07:54 PM