Share News

ఆస్తులపై నోటీసు..అభిషేక్ బెనర్జీ నివాసానికి భారీగా పోలీసులు

ABN , Publish Date - May 25 , 2026 | 06:51 PM

తృణమూల్ కాంగ్రెస్‌లో నెంబర్-2గా ఉన్న ఆ పార్టీ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసానికి సోమవారంనాడు పెద్దఎత్తున కోల్‌కతా పోలీసులు చేరుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఆస్తులకు సంబంధించి టీఎంసీ నిర్వహణలోని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది.

ఆస్తులపై నోటీసు..అభిషేక్ బెనర్జీ నివాసానికి భారీగా పోలీసులు
Kolkata police

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో నెంబర్-2గా ఉన్న ఆ పార్టీ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banejee) నివాసానికి సోమవారంనాడు పెద్దఎత్తున కోల్‌కతా పోలీసులు చేరుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఆస్తులకు సంబంధించి టీఎంసీ నిర్వహణలోని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో 188ఏ హర్ష ముఖర్జీ రోడ్డులోని శాంతినికేకేతన్ వద్దనున్న అభిషేక్ బెనర్జీ అధికారిక నివాసానికి పోలీసులు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే కొద్ది సేపటికే అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించారు.


అభిషేక్ బెనర్జీకి చెందిన పలు ఆస్తుల విషయంలో కేఎంసీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. బిల్డింగ్ ప్లాన్‌ ఆమోదానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని కోరింది. అభిషేక్‌కు చెందిన, ఆయనకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న 17 నుంచి 21 ప్రాపర్టీలకు సంబంధించి కేఎంసీ చట్టం-1980లోని సెక్షన్ 400(1) కింద ఈ నోటీసులు పంపింది. కాగా, కేఎంసీ చట్టంకింద తాము విధాన నిర్ణేతలమని, నోటీసుల విషయం తనకు తెలియదని టీఎంసీ ఎమ్మెల్యేగా కూడా ఉన్న కోల్‌కతా మేర్ ఫిర్హద్ హకీం తెలిపారు.


అభిషేక్ బెనర్జీకి నోటీసుల వ్యవహారంపై బీజేపీ స్పందించింది. ఆయనేమీ చట్టానికి అతీతుడేమీ కాదని, పదిహేనుళ్లుగా చట్టానికి అతీతంగా వ్యవహరించినప్పటికే అది ఎంతోకాలం సాగదని రాష్ట్ర మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. అభిషేక్ బెనర్జీ బిల్డింగ్‌లోని కొంతభాగం ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించినట్టు తెలుస్తోందని, దీనిపై అందరిలాగా ఆయన కూడా కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సరైన పేపర్లు, డాక్యుమెంట్లు ఉంటే ఎలాంటి చర్యలు ఉండవని, లేకుండా అది వారి తప్పదమే అవుతుందని అన్నారు. మరోవైపు, అభిషేక్ బెనర్జీకి నోటీసులపై బీజేపీని టీఎంసీ తప్పుపట్టింది. అవన్నీ కట్టుకథలేనని, వాటికి విశ్వసనీయత లేదని పేర్కొంది. నోటీసుల పేరుతో బీజేపీ అనధికారంగా లీకులు ఇస్తోందని విమర్శించింది.


ఇవి కూడా చదవండి..

ఏఐఏడీఎంకేలో ముదురుతున్న తిరుగుబాటు.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన అస్సాం సర్కార్

Updated Date - May 25 , 2026 | 06:59 PM