దీపావళి కానుక.. ఉద్యోగులు రూ. లక్ష నగదు బోనస్ ఇచ్చిన వ్యాపారి!
ABN , Publish Date - Nov 07 , 2026 | 09:52 PM
దీపావళి పండుగ అంటేనే ఉద్యోగులకు ఆయా సంస్థలు వివిధ రకాల బహుమతులు, స్వీట్లు ఇవ్వడం సర్వసాధారణం. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి మాత్రం తన సిబ్బందికి ఏకంగా రూ. లక్షకు పైగా నగదును బోనస్‌గా అందించాడు.
ఇంటర్నెట్: దీపావళి పండుగ అంటేనే ఉద్యోగులకు ఆయా సంస్థలు వివిధ రకాల బహుమతులు, స్వీట్లు ఇవ్వడం సర్వసాధారణం. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి మాత్రం తన సిబ్బందికి ఏకంగా రూ. లక్షకు పైగా నగదును బోనస్‌గా అందించాడు. రామ్ స్వరూప్ ముండే అనే వస్త్ర వ్యాపారి తన వద్ద పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. లక్షకు పైగా నగదును కొత్త కరెన్సీ నోట్ల రూపంలో అందజేశారు. రూ.10 నుంచి రూ. 500 వరకు వివిధ నోట్ల కట్టలను వెండి రంగు పళ్లెంలో అమర్చి ఉద్యోగులకు బహుమతిగా అందజేశాడు.
ఊహించని ఈ కానుకను చూసి మహిళా ఉద్యోగులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా రామ్ స్వరూప్ ముండే మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో ఎంతో పేదరికాన్ని అనుభవించానని, పండుగల సమయంలో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు తనకు బాగా తెలుసన్నారు. తన వద్ద పనిచేసే వారు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని, తన కుటుంబ సభ్యులతో సమానమని ఆయన వెల్లడించారు.
ఏడాదంతా తన వ్యాపార వృద్ధి కోసం కష్టపడిన సిబ్బందికి కృతజ్ఞతగా ఈ బోనస్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రతి కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలనేదే తన ఉద్దేశమని చెప్పారు. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఆయన తన సిబ్బందికి బహుమతులు ఇచ్చిన తీరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇవి కూడా చదవండి..
కారు పైభాగంలో సీక్రెట్ ఛాంబర్.. స్మగ్లర్ల తెలివికి షాక్ అయిన పోలీసులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..