పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్.. ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్..
ABN , Publish Date - Nov 07 , 2026 | 08:14 PM
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవితవ్యంపై సస్సెన్స్ వీడింది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. ఇప్పటివరకు పంజాబ్ తరఫున ఆడిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు మారనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవితవ్యంపై సస్సెన్స్ వీడింది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. ఇప్పటివరకు పంజాబ్ తరఫున ఆడిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు మారనున్నాడు. ఇరు ఫ్రాంచైజీలు ఈ ట్రేడ్‌కు అంగీకరించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ ఆమోదం, అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ మార్పిడి ఖరారవుతుంది. ఆ తర్వాత అధికారిక ప్రకటన రానుంది (Hardik Pandya Trade).
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడేందుకు హార్దిక్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ముంబై ఇండియన్స్‌కు 2024 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు ఆ తర్వాతి ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదు. అతడి నాయకత్వంలో మూడు సీజన్లలో రెండుసార్లు ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా 2026 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. దీంతో జట్టు పునర్నిర్మాణంపై ఫ్రాంచైజీ దృష్టి సారించింది (Arshdeep Singh Trade).
పాండ్యాకు బదులుగా అర్ష్‌దీప్‌ను ఇచ్చేందుకు పంజాబ్ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి (IPL 2027). పవర్‌ప్లేలో వికెట్లు తీయడంతో పాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల సామర్థ్యం అర్ష్‌దీప్ సొంతం. ముంబై ఇండియన్స్ జట్టులో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచస్థాయి పేసర్ ఉన్నాడు. ఇప్పుడు అర్ష్‌దీప్ కూడా జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా భారత పేసర్లతో కూడిన బౌలింగ్ దళాన్ని రూపొందించుకోవాలన్న ముంబై ఆలోచనకు ఈ ట్రేడ్ ఉపయోగపడనుంది. హార్దిక్ ముంబైని వీడనున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోనుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..