వంట, క్లీనింగ్ పనుల్లో భర్తలు కూడా పాలుపంచుకోవాల్సిందే: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:18 PM
భార్యను పనిమనిషిలా చూడకూడదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరిగిన వైవాహిక వివాదాల కేసు విచారణలో, ఇంటి పనుల్లో భర్తలు కూడా సమానంగా బాధ్యతలు పంచుకోవాలని స్పష్టం చేసింది.
ఢిల్లీ: భార్యాభర్తల సంబంధాల్లో సమానత్వం అత్యంత ముఖ్యమని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను పనిమనిషిలా చూడకూడదని, ఇంటి పనుల్లో భర్తలు కూడా బాధ్యత పంచుకోవాలని స్పష్టం చేసింది. వైవాహిక వివాదానికి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకున్నది జీవిత భాగస్వామి కోసం కానీ సేవలు చేయించుకోవడానికి కాదని కోర్టు గట్టిగా చెప్పింది.
ఇంటి పనులు కేవలం మహిళల బాధ్యత అనే పాత భావజాలాన్ని భర్తలు మార్చుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా పురుషులు తమ ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది. వంట, శుభ్రపరిచే పనులు వంటి గృహ కార్యకలాపాల్లో భర్తలు కూడా సమానంగా చేయాల్సిందేనని పేర్కొంది. ఇంటి పనుల్లో సమాన భాగస్వామ్యం ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి
ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
For More Latest News