Share News

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు

ABN , Publish Date - Mar 20 , 2026 | 03:56 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడుతోంది. తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారంనాడు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు
Premoum petrol

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడుతోంది. తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారంనాడు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 'స్పీడ్', హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 'పవర్', ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) 'XP95' పెట్రోల్ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ2.35 వరకూ పెరిగాయి. అయితే ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. మెరుగైన ఇంజన్ పనితీరు, మైలేజ్ కోసం వాహనాల్లో ప్రీమియం పెట్రోల్ వాడుతుంటారు.


ఇండస్ట్రియల్ డీజిల్ ధర 25 శాతం పెంపు

మరోవైపు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీగా పెంచింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను 25 శాతం పెంచింది. దీంతో లీటర్‌ ధర రూ.22 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ.87.57 నుంచి రూ.109.59కి ఇది పెరిగింది. ఇండస్ట్రియల్ డీజిల్‌ను విద్యుత్ అంతరాయాల సమయంలో జనరేటర్లపై నడిచే కర్మాగారాలు, ఫాపింగ్ మాల్స్‌‌, బుల్డోజర్లు, భారీ యంత్రాల్లో వాడుతుంటారు. వీటి ధరలు పెరగడం వల్ల కంపెనీల ఖర్చు పెరిగి వినియోగదారునిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

ఏప్రిల్ నెలాఖరుకల్లా 180 డాలర్లకు ముడి చమురు.. సౌదీ అధికారుల అంచనా

రికార్డు స్థాయి కనిష్ఠానికి రూపాయి!

Updated Date - Mar 20 , 2026 | 05:17 PM