కావేరి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:08 PM
కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కర్ణాటకకు 70 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రైవేట్ సొసైటీల పిటిషన్లు చెల్లవన్న సుప్రీంకోర్టు.. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో మూడో వ్యక్తులు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కర్ణాటకకు 70 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రైవేట్ సొసైటీల పిటిషన్లు చెల్లవన్న సుప్రీంకోర్టు.. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో మూడో వ్యక్తులు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సొసైటీల పిటిషన్లను విచారిస్తూ పోతే వివాదాలు ముగియవని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కావేరి జలాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే చట్టపరంగా పోరాడుతున్నాయని గుర్తుచేసింది. రెండు రాష్ట్రాల నదీ జలాల వివాదంలో ప్రైవేట్ సొసైటీలకు స్థానం లేదని తేల్చి చెప్పింది. నదీ జలాల కేటాయింపులపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే మాట్లాడే హక్కు ఉంటుందని పునరుద్ఘాటించింది.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కావేరి కేసుల నేపథ్యంలో కొత్త వ్యాజ్యాలకు తావులేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా.. కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు గత నెల 24న కొన్ని కీలక సూచనలు చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన కావేరీ నీటి వాటా సక్రమంగా అందడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సమస్యపై ముందుగా కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థను ఆశ్రయించాలని తమిళనాడుకు సుప్రీంకోర్టు సూచించింది.
Also Read:
‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులపై వెజ్, నాన్‌వెజ్ గుర్తులు.. కేంద్రం కొత్త నిబంధనలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్