చిన్న తప్పులకూ ఉద్యోగ బహిష్కరణ సరికాదు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jun 14 , 2026 | 09:29 PM
ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి చేసిన చిన్నతప్పులకు ఉద్యోగం నుంచి తొలగించడం అనేది అత్యంత కఠినమైన శిక్ష అని తెలిపింది.
ఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి చేసిన చిన్నతప్పులకు ఉద్యోగం నుంచి తొలగించడం అనేది అత్యంత కఠినమైన శిక్ష అని తెలిపింది. తీవ్రమైన దుష్ప్రవర్తన నిరూపితమైతేనే ఉద్యోగ బహిష్కరణ శిక్ష వేయాలని పేర్కొంది. చిన్నచిన్న తప్పులకు ఉద్యోగం నుంచి తీసేయడం అన్యాయమని చెప్పింది. ఉద్యోగి చేసిన తప్పు తీవ్రత, దాని ప్రభావం, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది.
‘శిక్ష అనేది చేసిన తప్పుకు తగినట్లుగా ఉండాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగిపై ఉన్న ఆరోపణల తీవ్రత ఆధారంగా మాత్రమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ప్రతి తప్పుకు ఉద్యోగ బహిష్కరణే పరిష్కారం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. క్రమశిక్షణా అధికారులు నిర్ణయాలు తీసుకునే సమయంలో న్యాయం, మానవత్వం రెండింటి మధ్య సమతుల్యత పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉద్యోగి భవిష్యత్తు, కుటుంబ పరిస్థితులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు సంబంధించిన క్రమశిక్షణా చర్యల విషయంలో మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News