Share News

టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:46 PM

టీఎంసీ రెబల్ ఎంపీల అనర్హతపై స్పీకర్ విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.

టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు
TMC Rebel MPs

ఢిల్లీ, ఆగస్టు 25: తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీల అనర్హతపై స్పీకర్ విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.


అనర్హత అంశంపై నిర్ణీత కాలవ్యవధిలోగా విచారణ జరపాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, ఈ విచారణ సందర్భంగా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. రెబల్ ఎంపీలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ న్యాయపరమైన పరిణామం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. టీఎంసీ రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని 20 మంది ఎంపీలు.. టీఎంసీని వీడి NCPI లో విలీనమవుతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. వీడియో వైరల్

Updated Date - Aug 25 , 2026 | 01:12 PM