హరీశ్ రాణా కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:18 PM
32 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హరీశ్‌రాణాకు వైద్యం నిలిపివేయొచ్చని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): 32 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా (Harish Rana Case) కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. హరీశ్‌రాణాకు వైద్యం నిలిపివేయొచ్చని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాణా కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి ఇచ్చింది. 13 ఏళ్లుగా అచేతన స్థితిలోనే హరీశ్‌రాణా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. 2013లో నాల్గో అంతస్తులోని బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ హరీశ్‌రాణా కింద పడిపోయారు.
కోమాలో హరీశ్ రాణా ..
ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా జీవితం ఒక ప్రమాదంతో పూర్తిగా మారిపోయింది. 2013 ఆగస్టు 20వ తేదీన జరిగిన ఈ ఘటన అతని జీవితాన్ని శాశ్వతంగా ప్రభావితం చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో అతడు.. చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఒక రోజు హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హరీశ్ రాణా తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం
జగన్ హయాంలో ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.. మంత్రి నారాయణ ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News