ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
ABN , Publish Date - Oct 05 , 2026 | 10:35 AM
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) పరిధిలోకి వచ్చే క్రీడా ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. గత నెల 18న ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని డీడీఏ అధికారులు తెలిపారు. డీడీఏ క్రీడా ప్రాంగణాల్లో ఆదివారం ఒక్కరోజే 2.5 టన్నుల చెత్తను సేకరించామని చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) పరిధిలోకి వచ్చే క్రీడా ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. గత నెల 18న ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని డీడీఏ అధికారులు తెలిపారు. డీడీఏ క్రీడా ప్రాంగణాల్లో ఆదివారం ఒక్కరోజే 2.5 టన్నుల చెత్తను సేకరించామని చెప్పారు. స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో చెత్తను పారేయడానికి వాటర్ డిస్పెన్సరీలు, తడి, పొడి చెత్తను వేరుచేయడం కోసం గ్రీన్ అండ్ బ్లూ చెత్త డబ్బాలు పెట్టామని వెల్లడించారు.
ఢిల్లీలోని పార్కులు, క్రీడా ప్రాంగణాలు, రీక్రియేషనల్ కేంద్రాల్లో నెలపాటు డీడీఏ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సానిటేషన్ వర్క్ చేయడం, మొక్కలు నాటడం, ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించడం, ఆ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం వంటివి చేస్తామని వివరించారు.
ఈ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో కార్యక్రమం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సాకేత్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నేతాజీ సుభాష్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్క్వాష్ అండ్ బ్యాడ్మింటన్ స్టేడియం, హరి నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, పశ్చిమ్ విహార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్టార్ 11, 17 లోని ద్వారకా స్పోర్ట్స్ కాంప్లెక్స్, మేజర్ ధ్యాన్ చంద్ స్పో్ర్ట్స్ కాంప్లెక్స్, రాష్ట్రీయ స్వాభిమాన్ ఖేల్ పరిసర్, పూర్వ్ ఢిల్లీ ఖేల్ పరిసర్, చెల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, కుతుబ్ గోల్ఫ్ కోర్స్, డీడీఏ లేక్ వ్యూ గోల్ఫ్ కోర్సుల్లో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, డీడీఏ చైర్మన్ తరణ్‌జిత్ సింగ్ సంధూ పర్యవేక్షణలో డీడీఏ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే పార్కులు, బహిరంగ స్థలాల్లో శుభ్రతను మెరుగుపరచడానికి ‘బిన్ బిఫోర్ ఓవర్‌ఫ్లో’ పేరుతో చెత్తడబ్బాలను పర్యవేక్షిస్తారు. చెత్త డబ్బా నిండితే ఎప్పటికపుడు ఖాళీ చేస్తారు. పబ్లిక్ టాయిలెట్లు, రీక్రియేషనల్ ప్రాంతాల్లో శుభ్రతను కొనసాగించడానికి క్యాపిటల్ ప్రామిస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధ విరమణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి
రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్ ధ్వంసం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..