దారుణం.. అనుమానంతో ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:02 PM
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడో ఉన్మాది. మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
కర్ణాటక, జూన్ 14: అక్రమ సంబంధాలు, వాటికి కారణంగా ఏర్పడే అనుమానలతో ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. క్షణికావేశంలో కొందరు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ భాగస్వామిని చంపడం లేదా చావడం వంటి ఘోరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
సిక్కిం రాష్ట్రానికి చెందిన అటి హంగ్మా సుబ్బ అనే 22 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ సెలూన్ షాపులో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుండేది. నిందితుడైన పూర్బా లెప్చా(25) ఓ హోటల్‌లో వెయిటర్‌గా ఉద్యోగం చేసేవాడు. అతడు డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇక హంగ్మా, పూర్బా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. సుమారు నెల రోజుల క్రితం వీరిద్దరూ బెంగళూరు నగరానికి వచ్చి.. దొడ్డకన్నహళ్లి ప్రాంతంలో కలిసి నివసిస్తున్నారు. సదరు యువతి వేరొకరితో సంబంధం కలిగి ఉందని పూర్బా అనుమానిస్తున్నాడు.
ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పూర్బా వంటగదిలో వినియోగించే కత్తితో అటి హంగ్మా సుబ్బ గొంతుపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బెల్లందూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
బల్క్ డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు.. ఆసుపత్రుల్లో ఆందోళన
చరిత్ర సృష్టించిన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్