తిరుగుబాటు ఎంపీలకు శివసేన(యూబీటీ) లీగల్ నోటీసులు
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:42 PM
శివసేన(UBT) తిరుగుబాటు ఎంపీలకు ఆ పార్టీ సీనియర్ నేత అరవింద్ సావంత్ లీగల్ నోటీసులు జారీ చేశారు. శివసేన(UBT) ఒరిజినల్ పార్టీ అని స్పష్టం చేశారు. పార్టీ అనుమతి లేకుండా వీరి విలీనం సాధ్యం కాదని ఆ నోటీసుల్లో ఆయన వివరించారు.
న్యూఢిల్లీ, జులై 14: శివసేన (UBT) తిరుగుబాటు ఎంపీలకు ఆ పార్టీ సీనియర్ నేత అరవింద్ సావంత్ లీగల్ నోటీసులు జారీ చేశారు. శివసేన (UBT) ఒరిజినల్ పార్టీ అని స్పష్టం చేశారు. పార్టీ అనుమతి లేకుండా వీరి విలీనం సాధ్యం కాదని ఆ నోటీసుల్లో ఆయన వివరించారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ గుర్తుపై గెలిచి ద్రోహం చేశారంటూ తిరుగుబాటు ఎంపీలపై అర్వింద్ సావంత్ మండిపడ్డారు. షిండే వర్గంలో వీరి విలీనం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. షిండే వర్గంలో చేరిన ఎంపీలు ఓం ప్రకాష్ నింబాల్కర్, సంజయ్ జాదవ్, నాగేష్ అష్టికర్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ దినా పాటిల్, వాక్‌చౌరేలకు నోటీసులు పంపారు.
మరో వైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను శివసేన (UBT) పార్టీ ఆశ్రయించింది. షిండే వర్గంలో వీరి విలీనాన్ని ఆమోదించవద్దని విజ్ఞప్తి చేసింది. 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం కేవలం ఎంపీలకు మాత్రమే విలీనం చేసే అధికారం లేదని ఉద్ధవ్ సేన లీగల్ సెల్ వాదిస్తోంది. ఈ పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులపై తీవ్ర చర్యలు తీసుకునేందుకు శివసేన (UBT) కేంద్ర కార్యాలయం మాతోశ్రీ సిద్ధమైంది. ఆ పార్టీ అంతర్గత వివాదంతో.. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
లోక్‌సభలో శివసేన (UBT)కి మొత్తం తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఆరుగురు పార్టీ ఫిరాయించారు. దీంతో ఆ పార్టీ బలం కేవలం 3 స్థానాలకి పరిమితమైంది. ఈ అంశంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకోబోయే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్ధవ్ క్యాంప్‌కు షిండే వర్గం ఆపరేషన్ టైగర్ పేరుతో భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..
For More National News And Telugu News