Share News

అగ్రికల్చర్ ఏఓ శ్రీహరి హత్య కేసులో ట్విస్ట్‌.. నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య

ABN , Publish Date - Jul 14 , 2026 | 02:53 PM

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు రైలు కిందపడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అగ్రికల్చర్ ఏఓ శ్రీహరి హత్య కేసులో ట్విస్ట్‌.. నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య
Prakasam Singarayakonda AO Issue

ప్రకాశం జిల్లా: వ్యవసాయ అధికారి (ఏవో) శ్రీహరి హత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ, తన కుటుంబంతో కలిసి సింగరాయకొండ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో హరికృష్ణ, అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


సమాచారం అందుకున్న రైల్వే, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఆస్తి కోసం హరికృష్ణ తన సొంత బావ అయిన వ్యవసాయ అధికారి శ్రీహరిని హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరికృష్ణ కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

కాగా.. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుచ్చిరెడ్డిపాలెం సీఐ, ఎస్ఐలను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సస్పెండ్ చేశారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన 23 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు.


Also Read:

ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..

ఈకేవైసీ లేకుంటే.. సిలిండర్‌ కట్‌

Updated Date - Jul 14 , 2026 | 05:11 PM