పార్లమెంటు మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్
ABN, Publish Date - Feb 04 , 2026 | 09:20 PM
పార్లమెంట్ ఆవరణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కిందపడిపోయారు. బుధవారం పార్లమెంటు వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో అఖిలేష్ యాదవ్ తో శశిథరూర్ కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ..
ఢిల్లీ, ఫిబ్రవరి 04: పార్లమెంట్ ఆవరణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కిందపడిపోయారు. బుధవారం పార్లమెంటు వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో అఖిలేష్ యాదవ్ తో శశిథరూర్ కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ముందుకు వెళ్లేందుకు మెట్లపై అడుగు వేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ముందుకు తూలి కింద పడిపోయారు. వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్లమెంట్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ ప్రమాణ స్వీకారం..
మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా
Updated at - Feb 04 , 2026 | 09:20 PM