Share News

వ్యవసాయ వ్యర్థాలపై అభ్యంతరం.. యూట్యూబర్ కుటుంబంపై మూకదాడి

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:37 PM

వ్యవసాయ వ్యర్థాలు తమ ఇంటివైపు రాకుండా చూసుకోవాలన్నందుకు రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మీను రాజ్ ప్రజాపత్ కుటుంబపై 20 మంది దాడిచేశారు. ఖైర్తాల్-తిజారా జిల్లా సారన్వస్ గ్రామంలో ఆదివారం ఈ దారుణ సంఘటన జరిగింది.

వ్యవసాయ వ్యర్థాలపై అభ్యంతరం.. యూట్యూబర్ కుటుంబంపై మూకదాడి

ఇంటర్నెట్ డెస్క్: వ్యవసాయ వ్యర్థాలు తమ ఇంటివైపు రాకుండా చూసుకోవాలన్నందుకు రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మీను రాజ్ ప్రజాపత్ కుటుంబపై 20 మంది దాడిచేశారు. ఖైర్తాల్-తిజారా జిల్లా సారన్వస్ గ్రామంలో ఆదివారం ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ దాడిలో మీను రాజ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు గొడ్డళ్లు, కత్తులు తదితర మారణాయుధాలు పట్టుకొని మీను ఇంట్లోకి చొరబడ్డారు. మీను, ఆమె భర్త కుల్దీప్, ఆమె తండ్రి బాబులాల్ ప్రజాపత్, మరో బంధువు ధన్‌రాజ్‌పై దుండగులు దాడిచేసి గాయపరిచారు. అనంతరం బాధితులను స్థానికులు కిషన్‌గర్భాస్‌లో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అల్వార్‌లోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.


వివాదం మొదలైందిలా..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మీను ఇంటి సమీపంలోని ఒక పొలంలో కొంతమంది చిరుధాన్యాలను యంత్రంలో వేసి నూర్పిడి చేస్తున్నారు. ఆ ధాన్యాల వ్యర్థాలు మీను ఇంటి వైపు వెళ్లడంతో పాటు రోడ్డుపైనా అడ్డంగా పడ్డాయి. దీనిపై మీను భర్త కుల్దీప్ అభ్యంతరం తెలిపారు. వ్యర్థాలు తమ ఇంటి వైపు రాకుండా చూడాలని కోరారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పొరుగింటి వారు 20 మంది ఆదివారం మీను ఇంట్లోకి ఆయుధాలతో చొరబడి మీను, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు చదవండి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పుణే విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

రామ్‌లీలా మైదానంలో ఇకపై 50 వేల మందికే అనుమతి

Updated Date - Nov 15 , 2026 | 06:37 PM