Share News

రామ్‌లీలా మైదానంలో ఇకపై 50 వేల మందికే అనుమతి

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:21 AM

దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్‌కు ప్రత్యామ్నాయంగా గుర్తించిన రామ్‌లీలా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలను నియంత్రించేందుకు..

రామ్‌లీలా మైదానంలో ఇకపై 50 వేల మందికే అనుమతి

న్యూఢిల్లీ, నవంబరు 14: దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్‌కు ప్రత్యామ్నాయంగా గుర్తించిన రామ్‌లీలా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలను రూపొందించారు. భద్రతా కారణాల దృష్ట్యా సభలకు గరిష్ఠంగా 50 వేల మందిని మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించారు. అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించుకునేలా పరిమితి విధించనున్నారు. ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) ముసాయిదాను రూపొందించి అనుమతి కోసం ఢిల్లీ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి పంపించారు.

Updated Date - Nov 15 , 2026 | 03:23 AM