Share News

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..

ABN , Publish Date - Aug 11 , 2026 | 04:11 PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ, చిన్నారితో కలిసి పడవలో ఉన్న రాహుల్ గాంధీ ఫొటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..
Rahul Gandhi viral photo

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ, చిన్నారితో కలిసి పడవలో ఉన్న రాహుల్ గాంధీ ఫొటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఈ ఫొటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? రాహుల్‌తో ఉన్న మహిళ, చిన్నారి ఎవరు?' అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు (Rahul Gandhi viral photo).


రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గతంలోనూ విమర్శలు చేసింది. జూన్ 22 నుంచి జులై 13 వరకు రాహుల్ చేపట్టిన విదేశీ పర్యటనపైనా బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. అయితే తాజాగా గిరిరాజ్ సింగ్ పంచుకున్న ఈ ఫొటో అదే పర్యటనకు సంబంధించినదా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. కాగా, వైరల్ అవుతున్న ఈ ఫొటోపై రాజకీయ చర్చ మొదలైన తర్వాత కాంగ్రెస్ వివరణ ఇచ్చింది (Giriraj Singh Rahul Gandhi).


రాహుల్ గాంధీతో ఫొటోలో కనిపిస్తున్న మహిళ, బాలుడు రాహుల్ గాంధీ స్నేహితుడి భార్య, కుమారుడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే తెలిపారు (Rahul Gandhi holiday photo). కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఫొటో తీసినట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ స్నేహితుడు మాత్రం ఆ ఫొటోలో లేరని స్పష్టం చేశారు. ఇక, ఈ ఫొటో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లేక్ రే రాబర్ట్స్ వద్ద తీసినదని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహిస్తున్న అవి దండియా తెలిపారు.


ఇవి కూడా చదవండి..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..


అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 11 , 2026 | 04:16 PM