ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:35 PM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట దక్కింది. ఈ కేసుపై విచారణ జరపాలని సీబీఐ, ఈడీకి గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపడేసింది. ఈ అంశంపై పునఃపరిశీలన చేయాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా రాహుల్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఓ బీజేపీ కార్యకర్త పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేశ్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై విచారణ జరపాలని కోరారు. ఈ ఆరోపణలు పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు.. సీఐడీ, ఈడీలను రంగంలోకి దిగాలని ఆదేశించింది. రాహుల్ ఆస్తులపై విచారణ జరపాలని సూచించింది. దీనిపై రాహుల్ గాంధీ ‘సుప్రీం’లో సవాలు చేయగా.. ఆయనకు న్యాయస్థానం ఊరటనిస్తూ ఆ ఆదేశాలను రద్దు చేసింది. అలాగే ఈ అంశంపై పునఃపరిశీలన చేయాలని, అసలు ఈ కేసు విచారణకు అర్హమైనదా.. కాదా అన్నది కూడా సమీక్షించాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలూ చదవండి
తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..
టీవీకే ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. విచారణకు కమిటీ ఏర్పాటు