టీవీకే ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. విచారణకు కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:03 PM
కళ్లకురిచి కలెక్టర్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీకే ఎమ్మెల్యే సి.అరుళ్ విఘ్నేశ్ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేపై నమోదైన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కళ్లకురిచి కలెక్టర్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీకే ఎమ్మెల్యే సి.అరుళ్ విఘ్నేశ్ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేపై నమోదైన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మద్రాస్ హైకోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించింది. తమిళనాడు పర్యావరణ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కాకర్ల ఉష ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి మధుమతి, ప్రభుత్వ అధికారి సుమతి, సామాజిక కార్యకర్త సునీతా జో ఇతర సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఈనెల 27లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే కమిటీని ఏర్పాటు చేశారు. కాగా.. ఎమ్మెల్యేపై ర్యాదు చేసిన మహిళా అధికారి స్వయంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించే జిల్లా స్థాయి కమిటీకి ఆమె నేతృత్వం వహిస్తున్నారు. అయితే, అదే కమిటీ పరిధిలోని అధికారి.. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయాల్సి రావడంతో ప్రత్యేక పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమె నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి బదులుగా ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు
ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు