మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:26 PM
భారత టెలికాం సంస్థ 'టెలికామ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ 2026' పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్లు కాకుండా, నెలకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 27: టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) 'టెలికామ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ 2026' పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్లు కాకుండా, నెలకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్ల వల్ల వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు నెలకు ఒకసారి (ఏడాదికి 12 సార్లు) మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.
వాయిస్, SMS-ఓన్లీ ప్లాన్లు: ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా, కేవలం సాధారణ కాల్స్, మెసేజ్‌ల (SMS) కోసం మాత్రమే ఫోన్ ఉపయోగించే తక్కువ బడ్జెట్ వినియోగదారులకు అనుగుణంగా ప్రత్యేకమైన చౌకైన 'Special Tariff Vouchers (STVs)' అందుబాటులోకి రానున్నాయి.
ఎంపీ రాఘవ్ చద్దా హర్షం: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మార్చి 11న పార్లమెంట్‌లో ఈ 28 రోజుల రీఛార్జ్ సైకిల్ సమస్యను, వినియోగదారుల ఆందోళనలను లేవనెత్తారు. ప్రభుత్వం, TRAI తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు, తక్కువ ఆదాయ వినియోగదారులకు పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.
నెలవారీ ఒకే తేదీన రీఛార్జ్: దీంతో ఇకపై ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే ప్లాన్లను టెలికాం కంపెనీలు కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి