Share News

పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:32 PM

ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ ఉగ్ర మాడ్యూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేశారు. కేసీఎఫ్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో పనిచేస్తుంది.

పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్
Punjab terror module

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో పనిచేస్తున్న ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (KCF) ఉగ్ర మాడ్యూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేశారు. ఎస్‌బీఎస్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్‌లో పోలీసులు నిందితుల నుంచి నాలుగు 86-పీ హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు 9 ఎంఎం పిస్టళ్లు, 20 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఈ మాడ్యూల్ పనిచేస్తోందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.


పక్కా సమాచారంతో అమృత్‌సర్ స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC), జలంధర్ కౌంటర్ ఇంటెలిజెన్స్, మరో కేంద్ర దర్యాప్తు సంస్థ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. విదేశీ హ్యాండ్లర్ల సూచనల మేరకు నిందితులు ఎస్‌బీఎస్ నగర్‌లోని బెహ్రామ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాల కన్సైన్‌మెంట్‌ను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.


ఈ ఘటనపై పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్, ఆయుధ చట్టం-1959 (Arms Act), పేలుడు పదార్థాల చట్టం (Explosive Substances Act)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్థానిక మద్దతుదారులు ఎవరున్నారు, ఈ నెట్‌వర్క్ మూలాలు ఎక్కడిదాకా విస్తరించాయన్న కోణంలో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

విదేశీ వికెట్లలో బుమ్రా రికార్డు.. శ్రీనాథ్‌ను దాటేశాడు!

హర్భజన్ సింగ్‌కు పాక్ అభిమాని స్పెషల్ రిక్వెస్ట్.. భజ్జీ రియాక్షన్ ఇదే!

Updated Date - Nov 29 , 2026 | 05:37 PM