బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ కమిటీ సమావేశంపై దాడి.. 30 మందికి గాయాలు..
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:34 PM
బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగ్‌పూర్‌లో దుర్గాపూజ ఉత్సవ కమిటీ సమావేశం సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 30 మంది గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగ్‌పూర్‌లో దుర్గాపూజ ఉత్సవ కమిటీ సమావేశం సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 30 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన యువజన విభాగం జుబో దళ్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తమకు ఈ దాడితో సంబంధం లేదని జుబో దళ్ నాయకులు ఖండించారు (Bangladesh Durga Puja).
రంగ్‌పూర్‌లోని స్టేడియంలో శనివారం దుర్గాపూజ ఉత్సవ కమిటీకి సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ కమిటీలో ఆవామీ లీగ్‌తో సంబంధం ఉన్న కొందరిని చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతో వివాదం మొదలైంది. సమావేశానికి ఢాకా నుంచి పలువురు కేంద్ర నాయకులు కూడా హాజరయ్యారు. వారు కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే కొందరు కార్యకర్తలు అక్కడికి చేరుకుని బ్యానర్లు చించివేశారు. కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు. అనంతరం అక్కడున్న నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఘర్షణలో కనీసం 30 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో ముగ్గురిని తీవ్ర గాయాలతో రంగ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు (BNP Youth Wing Jubo Dal).
ఈ ఘర్షణలో బీఎన్‌పీ యువజన విభాగమైన జుబో దళ్ కార్యకర్తల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి (Bangladesh Hindus). ఆవామీ లీగ్‌కు చెందిన వ్యక్తులను తిరిగి కమిటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని జుబో దళ్ నాయకుడు శ్రీ బిప్లబ్ ఆరోపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే జుబో దళ్‌కు చెందిన పలువురు నాయకులు ఈ ఆరోపణలను ఖండించారు. కమిటీలో కొందరిని చేర్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నిరసన తెలిపారని, దాడులు లేదా విధ్వంసంలో తమ ప్రమేయం లేదని పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..
భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..