Share News

భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:47 PM

అమెరికాలో భూకంప సమయంలో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేసి చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని భూకంపం కారణంగా పైలట్లు తిరిగి టేకాఫ్ చేశారు.

భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..
Delta Flight 1972

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భూకంప సమయంలో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేసి చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని భూకంపం కారణంగా పైలట్లు తిరిగి టేకాఫ్ చేశారు. ఈ విమానంలో తన కుమారుడు కో-పైలట్‌గా ఉన్నాడని టాడ్ క్రాస్బీ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విమానాన్ని సురక్షితంగా మళ్లించడంలో తన కుమారుడు కీలక పాత్ర పోషించాడని చెబుతూ గర్వం వ్యక్తం చేశారు (Los Angeles Earthquake).


నవంబరు 28న అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1972 లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది. విమానం రన్‌వేను తాకడానికి కొద్ది క్షణాల ముందు భూకంపం రావడంతో విమానాశ్రయంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. భూమి కంపించడంతో కెమెరా ఒక్కసారిగా ఊగిపోయింది. పరిసర ప్రాంతాల్లో వాహనాల అలారాలు కూడా మోగాయి. ఈ సమయంలో విమాన ట్రాఫిక్ నియంత్రణ కేంద్రం నుంచి పైలట్లకు అత్యవసర సమాచారం అందింది (Delta Airlines Pilot).


సమాచారం అందుకున్న పైలట్లు ల్యాండింగ్‌ను నిలిపివేసి విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లారు (Go Around Landing). విమానయాన రంగంలో దీనిని 'గో అరౌండ్' అంటారు. ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం లేదా అనుకోని పరిస్థితి ఎదురైతే విమానాన్ని రన్‌వేపై దించకుండా తిరిగి పైకి తీసుకెళ్లే భద్రతా ప్రక్రియ ఇది. తన కుమారుడు విమానం ల్యాండింగ్‌ను చివరి క్షణంలో నిలిపివేయాల్సి వచ్చిన పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్నాడని పేర్కొంటూ.. 'నా కుమారుడి విషయంలో ఎంతో గర్వంగా ఉంది. ఇది ఒక తండ్రిగా నాకు గర్వకారణమైన క్షణం' అంటూ టాడ్ క్రాస్బీ తన ఆనందాన్ని పంచుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 03:52 PM