Share News

పంజాబ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ కాల్పులు.. ఇద్దరు పాకిస్థానీయుల హతం

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:45 PM

పంజాబ్‌లోని రాజోకె సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ముగ్గురు పాకిస్థానీయులపై బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు పాక్‌ సరిహద్దులోకి పరారయ్యారు.

పంజాబ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ కాల్పులు.. ఇద్దరు పాకిస్థానీయుల హతం
bsf fires at indo pakistan border

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని రాజోకె సమీపంలోని ఇండో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ముగ్గురు పాకిస్థానీయుల ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) భగ్నం చేసింది.


బీఎస్ఎఫ్ అధికారుల వివరాల ప్రకారం.. కొందరు పాకిస్థానీయులు ఈ రోజు(శుక్రవారం) 12 నుంచి 1 గంట సమయంలో భారత్‌లోకి అక్రమంగా చొరబడే ప్రయత్నం చేశారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని హెచ్చరించారు. అయినప్పటికీ వారు లెక్కచేయకుండా కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో వ్యక్తి తప్పించుకుని పాక్ భూభాగంలోకి పారిపోయాడు.


కాగా.. జులైలో కూడా కొంతమంది పాక్ వాసులు జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా ప్రాంతంలో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరపడంతో వెనుదిరిగారు. అదే రోజు సాయంత్రం హీరానగర్ సెక్టార్ వద్ద అక్రమదారుల కదలికలను గమనించిన బీఎస్ఎఫ్ వారిని హెచ్చరించగా.. వారు కాల్పులు జరిపారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎదురుకాల్పులకు దిగడంతో పరారయ్యారు. ఈ వరుస ప్రయత్నాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్ మరింత బలగాలను మోహరించి.. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసింది.

Updated Date - Oct 02 , 2026 | 08:53 PM