ఎన్నికల సంఘంపై ప్రియాంక, రాహుల్, ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:13 PM
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరగడానికి సహకరిస్తే అది ప్రజాస్వామ్యంపై జరిగే తీవ్రమైన దాడిగా అభివర్ణించారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 23: ఎన్నికల నిష్పాక్షికతపై రాజకీయ రచ్చ పీక్ స్టేజ్‌కి చేరింది. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం ఆధారంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల సంఘం మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ECI పనితీరుపై మండిపడుతున్నారు.
కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూరులో మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా జరగకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని, ఎన్నికల్లో అక్రమాలు జరగడానికి ఎన్నికల సంఘం సహకరిస్తే అది ప్రజాస్వామ్యంపై జరిగే తీవ్రమైన దాడి అని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల కమిషనర్లకు ఈ అక్రమాల గురించి తెలిసి కూడా అనుమతిస్తుంటే, అది తీవ్రమైన 'దేశద్రోహ చర్య' క్రిందికే వస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఓటు చోరీ అనేది భారత ప్రజలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే నేరమని కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములవుతున్న అధికారులు రాజ్యాంగ వ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని, భవిష్యత్తులో బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు