భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ చొరబాటుదారుడు.. కాల్చి చంపిన బీఎస్ఎఫ్
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:07 PM
అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ చొరబాటుదారుణ్ని బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ చొరబాటుదారుణ్ని బీఎస్ఎఫ్(Border Security Force) దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటన ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. అనంతరం ఈ విషయాన్ని దళాలు అధికారికంగా వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో సరిహద్దు నుంచి పాకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. 120 మీటర్ల వరకు భారత్ భూభాగంలోకి చొరబడ్డాడు. అతడిని గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా ఆ యువకుడు ముందుకు రావడానికి ప్రయత్నించగా.. దళాలు కాల్పులు జరిపాయి. దీంతో అతడు మరణించాడు.
కాగా గత నెల (అక్టోబర్) రెండో తేదీన ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ముగ్గురు పాకిస్థాన్ వ్యక్తులు ప్రయత్నించారు. తరువాత ఒకరు వెనుతిరగగా, మిగిలిన ఇద్దరూ భారత్ భూభాగం వైపునకు కదిలారు. చొరబాటుదారులను గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి హతమార్చాయి.
ఈ వార్తలూ చదవండి
డీలిమిటేషన్ ఆమోదానికి మ్యాజిక్ ఫిగర్ 360.. మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం
గుజరాత్‌లో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్టు.. ఏకే 47 సీజ్