Asaduddin Owaisi: ట్రంప్ చేసిన పని మోదీ చేయలేరా... వెనెజువెలా ఘటనపై ఒవైసీ
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:41 PM
మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి తీసుకువెళ్లినప్పుడు 170 మంది ప్రాణాలను బలికొన్న 2008 ఉగ్రదాడుల నిందితులైన మసూద్ అజహర్, లష్కరే తొయిబా నేతలను కూడా మోదీ పట్టుకురావచ్చు కదా అని ఒవైసీ అన్నారు.
ముంబై: వెనెజువెలా ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యతో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించి యూఎస్ తీసుకువెళ్లినట్టే 26 /11 ముంబై దాడి ప్రధాన సూత్రధారులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ నుంచి ఇండియాకు తీసుకురావాలని అన్నారు.
మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి తీసుకువెళ్లినప్పుడు 170 మంది ప్రాణాలను బలిగొన్న 2008 ఉగ్రదాడుల నిందితులైన మసూద్ అజహర్, లష్కరే తొయిబా నేతలను కూడా మోదీ పట్టుకురావచ్చు కదా అని ఒవైసీ అన్నారు. ముంబై పురపోరు ఈనెల 15న జరుగనున్న నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా, అమెరికాలోకి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని, వాటికి అడ్డుకట్టు వేసేందుకు మదురోను పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడాన్ని క్యూబా, కొలంబియా, మెక్సికో వంటి దేశాలు ఖండించాయి. యుఎస్ దాడులు దురాక్రమణ కిందకే వస్తాయని ఆ దేశాలు పేర్కొన్నారు. అయితే ఈ మూడు దేశాలు సైతం మాదక ద్రవ్యాలను తయారు చేసి అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ట్రంప్ మరోసారి ఆరోపించారు. డ్రగ్స్ ముఠాలకు ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయని, పద్ధతి మార్చుకోకుంటే వెనెజువెలాకు పట్టినగతే ఆ దేశాలు కూడా ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా కనుసన్నల్లో వెనెజువెలా వ్యవహారాలు.. భారత్‌కు ప్రయోజనం ఇదీ
బలవంతుడిదే రాజ్యం... వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యపై శశిథరూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి