Share News

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

ABN , Publish Date - Nov 20 , 2026 | 09:25 PM

పెళ్లి చేసుకోవాలంటూ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఒత్తిడి చేసిన యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఒత్తిడి చేసిన యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన అభినవ్‌.. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న నేహా బిష్త్ అనే ఇన్‌ఫ్లుయెన్స్ వీడియోలను అతడు క్రమం తప్పకుండా చూసేవాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. గతంలో ఓసారి అభిమానిగా ఆమె ఇంటికి వెళ్లాడు. కాగా.. నేహాకు ఇటీవలే ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న అభినవ్‌ ఈనెల 7న తూర్పు ఢిల్లీలోని మధు విహార్‌లో ఉన్న నేహా ఇంటికి వెళ్లి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. తనను పెళ్లి చేసుకోవాలని నేహాను డిమాండ్‌ చేశాడు.


అభినవ్‌ తీరుతో ఆగ్రహించిన నేహా కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు అతడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న అభినవ్‌ను రాజీవ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అతడు ఈనెల 15న చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేహా తండ్రి వీరేందర్‌ బిష్త్‌తో పాటు ఓ పొరుగింటి వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దాడిలో పాల్గొన్న ఇతరుల వివరాలను సేకరిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 20 , 2026 | 09:25 PM