భారత్‌లో తొలి స్వదేశీ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:30 PM
భారత్‌కు చారిత్రక విజయం సిద్ధించింది. దేశంలోనే తొలి స్వదేశీ బర్డ్ ఫ్లూ (H5N1) వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతికి అంకితం చేశారు. దీంతో పౌల్ట్రీ రంగానికి భారీ రక్షణ కలుగుతుంది.
ఢిల్లీ, నవంబర్ 20: : పౌల్ట్రీ రంగానికి రక్షణ కవచంగా నిలిచేలా భారత శాస్త్రవేత్తలు మరో చారిత్రక విజయాన్ని సాధించారు. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ బర్డ్ ఫ్లూ (H5N1) వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతికి అంకితం చేశారు. భోపాల్‌లోని ICAR-NIHSAD (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్) శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు.
మన శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం: కొవిడ్ వ్యాక్సిన్ల తయారీ తరహాలోనే, ఈ H5N1 వ్యాక్సిన్ రూపకల్పన మన శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభకు నిదర్శనమని మంత్రి కొనియాడారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా వేసిన మరో కీలక అడుగు అని అభివర్ణించారు.
పౌల్ట్రీ రంగానికి ఊరట, ప్రజారోగ్యానికి రక్షణ: 2006 నుంచి దేశంలో 500కు పైగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోళ్లకు ప్రాణాపాయం తప్పడంతో పాటు, పౌల్ట్రీ రంగానికి భారీ ఆర్థిక నష్టాలు తగ్గుతాయి. అంతేకాకుండా, పక్షుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందే ముప్పుకు కూడా చెక్ పడనుంది.
భోపాల్‌లో BSL-4 ల్యాబ్ ఏర్పాటు: భవిష్యత్తులో ప్రమాదకర వైరస్‌లపై మరింత లోతైన పరిశోధనలు జరిపేందుకు వీలుగా, భోపాల్‌లోని NIHSAD సంస్థలో త్వరలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు కలిగిన అత్యాధునిక BSL-4 (Biosafety Level-4) ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. (India’s First Bird Flu Vaccine)
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..