డిప్రెషన్‌లో ఉన్నానంటూ 41 ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య.. వీడియో
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:12 PM
‘నేను డిప్రెషన్‌లో ఉన్నా’ ఇవి ఓ వ్యక్తి చివరిమాటలు. మానసిక ఒత్తిడి కారణంగా ఆ వ్యక్తి బలవన్మరణాకి పాల్పడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నేను డిప్రెషన్‌లో ఉన్నాను’ అంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లోని 41 ఫ్లోర్ నుంచి దూకి ఆయన బలవన్మరణాకి పాల్పడ్డారు. ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఈరోజు (శనివారం) జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంభవ్ జైన్ (28) గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. అయితే ఒకరోజు స్టే కోసం ఆయన నోయిడాలోని స్పైర్ బిల్డింగ్ అనే అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. ఈరోజు ఉదయం 41 ఫ్లోర్‌కు వెళ్లి.. అక్కడి నుంచే దూకేందుకు సిద్ధమయ్యారు. ఆ ఫ్లోర్‌లోనే పనిచేస్తున్న కొందరు ఏసీ వర్కర్లు సంభవ్‌ను చూశారు. ఆయన్ను ఆపడానికి ప్రయత్నించారు. ఈలోపే సంభవ్.. ‘నేను డిప్రెషన్‌లో ఉన్నా’అంటూ కిందకు దూకేశారు. ఆ తరువాత మరణించారు. ఈ సంఘటన మొత్తానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన సమయంలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య వెనుక కారణాలు ఇంకా తెలియలేదు. సంభవ్ కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలూ చదవండి
యువతిపై దాడి చేసి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలుడు.. ఐదుగురికి పైగా మృతి